Chiru:నాకు నచ్చితేనే చేస్తా..నచ్చితేనే చూస్తా

39
- Advertisement -

ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చితేనే చూస్తా అన్నారు మెగాస్టార్ చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తుండగా మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సుశాంత్‌, కీర్తి సురేష్ లు కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండగా ఆగ‌స్టు 11న రిలీజ్ కానుంది.

Also Read:ఆర్కే టెలీ షో…’సర్కారు నౌకరి’

ఈ సందర్భంగా మాట్లాడిన చిరు…రీమేక్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మధ్య నన్ను రీమేక్ సినిమాలు చేస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నారు. ఒక మంచి సినిమా, కంటెంట్ వస్తే అది నా అభిమానులకి, తెలుగు ప్రేక్షకులకి అందచేయాలని భావిస్తాను అన్నారు. అందుకే రీమేక్ సినిమాలు మంచివి వస్తే చేస్తాను. అయితే ఇటీవల ఓటీటీ వల్ల అన్ని సినిమాలు ప్రేక్షకుల దగ్గరికి వస్తున్నాయి. అందుకే వేదాళం సినిమా రీమేక్ వచ్చినప్పుడు ఇది బయట ఓటీటీలలో ఎక్కడా లేదని తెలుసుకొని ఈ సినిమా చేశాను అని తెలిపారు. భవిష్యత్‌లో కూడా మంచి సినిమాలు వస్తే రీమేక్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేస్తానని తెలిపారు.

Also Read:పొత్తుకు పవన్ వెనుకడుగు.. కారణం అదే?

- Advertisement -