రెండో టీ20లోనూ హార్ధిక సేన ఓటమి..

38
- Advertisement -

విండీస్‌తో జరిగిన రెండో టీ20లోనూ భారత్ ఓటమి పాలైంది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 155 పరుగులు చేసి విజయం సాధించింది. నికోలస్‌ పూరన్‌ 40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లతో రాణించగా పావెల్‌ (21; ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌), హెట్‌మైర్‌ (22) రాణించారు.చివర్లో అకీల్‌ హుసేన్‌ (16 నాటౌట్‌), అల్జారీ జోసెఫ్‌ (10) జట్టును విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా 3, యుజ్వేంద్ర చాహల్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.తిలక్ వర్మ (41 బంతుల్లో 51; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) హాఫ్‌సెంచరీతో రాణించగా ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (27), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (24) పర్వాలేదనిపించారు. పూరన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Also Read:పొత్తుకు పవన్ వెనుకడుగు.. కారణం అదే?

- Advertisement -