ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ తమిళి సై అమోదం తెలిపారు. గవర్నర్ అడిగిన అన్ని సందేహాలనే నివృత్తి చేసింది ప్రభుత్వం. దీంతో బిల్లుకు అమోదం తెలిపారు గవర్నర్.ఎంతో కాలంగా ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తుండగా ఆ కోరికను నెరవేర్చారు సీఎం కేసీఆర్.
కేబినెట్ అమోదం ట్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. కేబినెట్ ఆమోదంతో ఆర్టీసీ బిల్లును తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతకు ముందే ఈ బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపారు. అయితే ఈ బిల్లుకు సంబంధించిన పలు అంశాలపై వివరణ కోరుతూ గవర్నర్ బిల్లును పెండింగ్‌లో పెట్టగా కార్మికులు నిరసనకు దిగారు. అయితే తాజాగా ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో బిల్లుకు అమోదం తెలిపారు గవర్నర్.
Also Read:కృష్ణ…దేవుడిలాంటి మనిషి