- Advertisement -
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అసెంబ్లీలోని హాల్‌లో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ అధికారులు జయశంకర్ సార్‌కు నివాళులు అర్పించారు.
ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ప్రొఫెసర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.
స్వరాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా జీవితాంతం లడాయి చేసిన పోరాటయోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఉద్యమాల ఉపాధ్యాయుడు.. తెలంగాణ సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన పోరాటయోధుడు…పుట్టుక ఆయనదే.. చావు ఆయనదే. కానీ… జయశంకర్ సార్ బతుకంతా తెలంగాణది.
Also Read:కృష్ణ…దేవుడిలాంటి మనిషి
- Advertisement -