ఇంతింతై వటుడింతై అన్నట్లుగా హైదరాబాద్ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న వర్తమాన పరిస్థితికి అద్దం పడుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. కోకాపేట భూముల వేలంలో ఎకరాకు రూ. 100 కోట్లు పలకడం తెలంగాణ సాధిస్తున్న ప్రగతికి దర్పణం అన్నారు.
ఎవరెంత నష్టం చేయాలని చూసినా ధృఢచిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, హైదరాబాద్ వంటి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి దక్కిన ఫలితమని అన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న హెచ్‌ఎండీఏ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్‌ను కేసీఆర్ అభినందించారు.
దేశంలోనే అత్యధికంగా కోకాపేటలో ఎకరానికి రూ. 100 కోట్ల ధర పలికిన సంగతి తెలిసిందే. నియోపోలిస్ ఫేజ్-2లో గల 3.6 ఎకరాల ప్రైమ్ ప్లాట్‌ను హ్యాపీ హైట్స్, రాజపుష్ప సంస్థలు కలిసి రూ.362.72 కోట్లకు దక్కించుకున్నాయి. ఈ స్థలంలో దాదాపు 45 అంతస్థుల వరకు హైరైజ్ భవనాలను నిర్మించి, కనీసం 210 వరకు ఫ్లాట్లను కట్టే అవకాశం ఉంది.
Also Read:ఆటో డెబిట్ ఆప్షన్ తో..కేర్ ఫుల్!