ముగిసిన బీఏసీ..3 రోజులు అసెంబ్లీ సమావేశాలు

28
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలి రోజు దివంగత సభ్యులకు సంతాపం తెలిపిన అనంతరం సభ వాయిదా పడగా అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. 3 నుంచి 4 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

20 రోజులు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ సభ్యులు కోరగా ముందు 3 రోజులపాటు సెషన్స్ జరిగాక, మళ్లీ చర్చించి నిర్ణయం చేద్దామని అధికార పార్టీ నేతలు తెలిపారు.

ఇక అంతకముందు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల శాసనసభ నివాళి అర్పించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన గొప్ప నాయకుడు సాయన్న అన్నారు సీఎం. ఐదు సార్లు ఎమ్మెల్యేగా వివిధ హోదాల్లో పనిచేశారని…వ్యక్తిగతంగా ఆయనతో మంచి అనుబంధం ఉందని చెప్పారు.

Also Read:హ్యాపీ బర్త్ డే..సీఎం సిద్దరామయ్య

- Advertisement -