ఈ నెల 4న డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరుగనుంది. శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగే ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
Also Read:Tamarind:చింతపండు అతిగా వాడితే ప్రమాదమా?
మరోవైపు టీటీడీ మ్యూజియం అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మ్యూజియంలోని ఒకటో జోన్‌లో ఆలయ అనుభూతి కల్పించే పనులు, రెండో జోన్‌లో అన్నమయ్య గ్యాలరీ, ధ్యానమందిరం, స్వామివారి ఆభరణాలు, నాణేలు, పురాతన వస్తువులు హోలోగ్రామ్ టెక్నాలజీతో ప్రదర్శించే ఏర్పాటు చేయనున్నారు. ఆభరణాల 3డి ఇమేజింగ్ ద్వారా భక్తులు తాము స్వామివారి నిజమైన ఆభరణాలు చూస్తున్నామనే అనుభూతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read:సీట్లు తేల్చే పనిలో పవన్?