KTR:ఎంఎల్‌పీలతో ట్రాఫిక్ సమస్యకు చెక్

35
- Advertisement -

రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు సలహాలివ్వాలని ట్విట్టర్‌ ద్వారా కోరారు మంత్రి కేటీఆర్.

Also Read:టెస్టు క్రికెట్‌కు బ్రాడ్ గుడ్..

పార్కింగ్‌ సమస్యను పరిష్కరించడం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఒక సవాలుగా మారిందన్నారు. హైదరాబాద్‌లో పార్కింగ్‌ సమస్యను పరిష్కరించేందుకు పలు ఎంఎల్‌పీలను నిర్మిస్తున్నామని …ఇలాంటి ఎంఎల్‌పీలు ఇంకా చాలా చాలా అవసరమని తెలిపారు. ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు.

ప్రజలు స్థానిక మున్సిపల్‌ అధికారులతో కలిసి తమ ఖాళీ స్థలాలను పార్కింగ్‌ స్థలాలుగా మార్చుకుని రెగ్యులర్‌ ఆదాయం పొందవచ్చని మంత్రి కేటీఆర్‌ సలహా ఇచ్చారు. ఇవే కాకుండా పార్కింగ్‌ సమస్యను పరిష్కరించడం కోసం తమ టీమ్‌ మరిన్ని ఆలోచనలు చేస్తోందని కూడా చెప్పారు.

- Advertisement -