యాక్టర్ ప్రదీప్ ఆత్మహత్య..

321
- Advertisement -

వర్ధమాన నటుడు, టీవీ యాక్టర్ ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.  దీంతో బుల్లితెర ఇండస్ట్రీ విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ అల్కాపూర్ టౌన్ షిప్ గ్రీన్ హోమ్స్ లో నివాసం ఉంటున్నాడు. జెమిని టీవీలో వచ్చే సప్తమాత్రిక సీరియల్ లో ప్రదీప్ హీరోగా నటిస్తున్నాడు. ఆరుగురు పతివ్రతలు, ఇతర సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు.
TV actor Pradeep Kumar commits suicide
ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేని అని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ప్రదీప్ కు పెళ్లయ్యింది. భార్య కూడా టీవీ సీరియల్స్ లో నటిస్తుంది. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న పోలీసులు… స్పాట్ కు చేరుకుని విచారణ చేస్తున్నారు. ఇటీవలే ప్రదీప్ కు టీవీ నటి పావనీరెడ్డితో వివాహం అయ్యింది. ఇద్దరూ సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ టైంలోనే ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవటం టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

- Advertisement -