రాజమౌళి – మహేష్‌..మల్టీస్టారర్‌ మూవీనా!

32
- Advertisement -

టాలీవుడ్‌లో వైవిధ్యమైన, మల్టీస్టార్ సినిమాలకు కేరాఫ్‌ రాజమౌళి. జక్కన్న కాంబినేషన్‌లో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్నాయి. రీసెంట్‌గా రామ్ చరణ్ – ఎన్టీఆర్‌లతో కలిసి ఆర్ఆర్ఆర్‌ని తెరకెక్కించగా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ప్రస్తుతం మహేష్‌తో కలిసి సినిమా చేస్తున్నారు రాజమౌళి.

ఈ సినిమా కూడా మల్టీస్టారర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టులుగా ఈ సినిమా ఉండనుండగా మొదటి పార్ట్ లో మహేష్ హీరోగా, రెండో పార్ట్ లో మరో స్టార్ హీరో హీరోగా నటిస్తాడని టాక్. మెయిన్ గా రెండో పార్ట్ లో ఓ బాలీవుడ్ హీరో కనిపిస్తాడని.. మొత్తానికి జక్కన్న ఈ సినిమాని కూడా మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Also Read:NBK:ఆర్‌ఎఫ్‌సిలో ‘భగవంత్ కేసరి’

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్‌.. త్రివిక్రమ్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. నవంబర్‌లోపు ఈ సినిమా పూర్తికానుండగా తర్వాత రాజమౌళి సినిమాలో పాల్గొననున్నారు.

Also Read:బీజేపీలో ఉండలేం.. బాబోయ్?

- Advertisement -