సినిమాలో లిప్ లాక్ ఉందంటే చాలు.. ఆ మూవీపై టాక్ పెరిగిపోతుంది. అందరి దృష్టిని లిప్ లాక్ అనే పదం ఆకర్షిస్తుంది. అలాంటి ముద్దుతో గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది ఓ జంట. ఘాటు ముద్దుతో అంటే ఏకంగా 15 నిమిషాల 6.5 సెకన్ల పాటు కిస్ చేసుకుని గిన్నిస్‌లో చోటు సంపాదించారు.
కెనడాకు చెందిన మైక్, జామీ జాక్ దంపతులు ఈ రికార్డును నెలకొల్పారు. వీరి ముద్దు వెనుక మరో ట్విస్ట్ ఉంది. అత్యంత ఘాటైన, కారమైన మిరపకాయను వారు లిప్‌లాక్‌కు ముందు తిన్నారు. ఆ తర్వాత వారు ఈ 15 నిమిషాల 6.5 సెకన్ల పాటు ముద్దు పెట్టుకోవడం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడానికి కారణమైంది.
Also Read:సినీ స్టార్స్ పై పవన్ స్ట్రాటజీ?
ఈ జంటట త్వరలోనే తమ 15 వ మ్యారేజ్ డేను జరుపుకోనున్నారు. ఈ 15 వ వివాహ వార్షికోత్సవాన్ని చిరకాలం గుర్తుంచుకునే విధంగా ఉండేందుకే ఈ ఘాటైన ముద్దు పెట్టుకున్నట్లు గిన్నీస్ బుక్‌లో పేరు సంపాదించిన తర్వాత వెల్లడించారు. ఈ ఘనతను సాధించేందుకు తాము ఇద్దరం రోజూ ప్రాక్టీస్ చేసేవారమని .. జామీ జాక్‌కు నెల రోజుల నుంచి ఈ లిప్‌లాక్ గురించి ట్రైనింగ్ ఇచ్చినట్లు మైక్ వెల్లడించారు.త్వరలోనే ‘భూట్ జోలోకియా చిల్లీ పెప్పర్’ తిని మరో సరికొత్త లిప్‌లాక్ రికార్డు సొంతం చేసుకుంటామని చెబుతున్నారు. దీంతో అంతా ఈ జంటకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
Also Read:పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నాజర్