నేటిరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఉదయం నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మొబైల్ తోనే గడిపేస్తూ ఉంటాము. అయితే మొబైల్ యూజర్లు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య బ్యాటరీ త్వరగా కంజూమ్ అవ్వడం అత్యవసర పరిస్తితులో బ్యాటరీ పర్సెంటేజ్ అయిపోతే.. మళ్ళీ చార్జింగ్ పెట్టుకుని బ్యాటరీ ఫుల్ అయే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అందుకే మొబైల్ చార్జింగ్ త్వరగా అయిపోకుండా ఉండేందుకు అనవసరమైన యాప్స్ ఉపయోగిస్తుంటారు. అయితే బ్యాటరీ లైఫ్ ను పెంచే యాప్స్ ను వాడడం వల్ల బ్యాటరీ లైఫ్ ఇంకా త్వరగా అయిపోతుంది. అందుకే కొన్ని చిట్కాల ద్వారా బ్యాటరీ లైఫ్ ను పెంచుకోవచ్చు అవేంటో చూద్దాం !
బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ను నిలిపివేయడం
మొబైల్ లో చాలా రకాల యాప్స్ ఇన్ స్టాల్ చేస్తుంటాము. అయితే కొన్ని యాప్స్ ను యూస్ చేయనప్పటికి వాటిని ఫోన్ లో అలాగే ఉంచుతుంటాము. అలాంటప్పుడు ఆ యాప్స్ బ్యాక్ గ్రాండ్ లో రన్ అవుతూ మొబైల్ బ్యాటరీ ని కంజూమ్ చేస్తాయి. కాబట్టి అవసరం లేని యాప్స్ ను ఆన్ ఇన్స్టాల్ చేయాలి. ఇంకా అవసరం మేరకే యాప్స్ ను మొబైల్ లో ఉంచుకోవాలి.
Also Read:సినీ స్టార్స్ పై పవన్ స్ట్రాటజీ?
స్క్రీన్ సేవర్స్ కు దూరం
మొబైల్ బ్యాటరీ లైఫ్ ను తగ్గించే వాటిలో స్క్రీన్ సెవర్స్ కూడా ఉంటాయి. ఇవి ఎప్పుడు ఆన్ లో ఉండడం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది. కాబట్టి స్క్రీన్ సెవర్స్ వడకపోవడమే మంచిది. ఇంకా ఇప్పుడొస్తున్న మొబైల్స్ లో అల్వెస్ ఆన్ డిస్ ప్లే, వంటి ఫీచర్లు కూడా వస్తున్నాయి. వీటి వల్ల కూడా బ్యాటరీ ఎక్కువగా కంజూమ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఫీచర్స్ ను వాడకపోవడమే మంచిది.
స్క్రీన్ బ్రైట్ నెస్
మొబైల్ బ్యాటరీని ఎక్కువగా డ్రైన్ చేయడంలో స్క్రీన్ బ్రైట్ నెస్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. సన్ లైట్ లోనూ రాత్రిపూట.. ఇలా ఏని టైమ్ బ్రైట్ నెస్ ఉండడం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆటో బ్రైట్ నెస్ ను ఉపయోగిస్తూ ఉండాలి. అవసరమైతే తప్పా స్క్రీన్ బ్రైట్ నెస్ ను హెవీగా పెంచకూడదు. ఇంకా చెప్పాలంటే డార్క్ మోడ్ లోనే మొబైల్ ను యూస్ చేయడం మంచిది.
ఈ చిట్కాలు పాటిస్తే మొబైల్ బ్యాటరీ లైఫ్ మెరుగుపడే అవకాశం ఉంది.
Also Read:పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నాజర్