విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన 115 పరుగుల లక్ష్యాన్ని భారత్ 20.5 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 118 పరుగులు చేసి గెలుపొందింది.
ఇషాన్ కిషన్ 52 పరుగులు పరుగులు చేయగా ,గిల్(7),సూర్య 19, హార్దిక్ పాండ్యా(5), రవీంద్ర జడేజా(16), శార్దుల్ ఠాకూర్(1) పరుగులు చేశారు. ఈ గెలుపుతోవెస్టిండీస్‌పై వరుసగా 9వ వన్డే మ్యాచు గెలిచి రికార్డు సృష్టించింది.
Also Read:#D51 అనౌన్స్ మెంట్
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. ఓ దశలో 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసిన విండీస్.. చివరి 7 వికెట్లను 26 పరుగులు మాత్రమే చేసి కొల్పోయింది. కెప్టెన్ షై హోప్(43) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించగా 3 ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్ 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా 3 , హార్దిక్ పాండ్యా, డెబ్యూ ప్లేయర్ ముకేశ్ కుమార్, శార్దుల్ ఠాకూర్ తలా ఓ వికెట్ పడగొట్టారు. రెండో వన్డే జులై 29న జరగనుంది.
Also Read:మన సినిమా బాగుందని ఎవరిని కించపరచొద్దు..