అరటిపండు గురించి మనందరికి తెలిసే ఉంటుంది. చాలమందికి ఇష్టమైన ఫలల్లో అరటిపండు కూడా ఒకటి. దీనిని ఎక్కువగా భోజనం చేసిన తరువాత లేదా బోజనానికి ముందు తింటూ ఉంటారు. ఇంకా అరటిని ఫ్రూట్ సలాడ్ లలో కూడా వాడుతుంటారు. అరటిపండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయని చాలమందికి తెలుసు. అయితే అరటిపువ్వును తినడం వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా ? అవునండి అరటిపువ్వు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అరటి పువ్వును ఆయుర్వేదంలో పలు ఔషదల తయారీలో ఉపయోగిస్తారు. .
ఇంకా చర్మ సౌందర్యాన్ని పెంచే ఉత్పత్తులలో కూడా అరటిపువ్వు ను ఉపయోగిస్తారు. ఇంకా చెప్పాలంటే వివిధ వంటకాలలో కూడా అరటి పువ్వు ను వాడుతుంటారు. అరటి పువ్వులో కాల్షియం, పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం వంటి మూలకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా అరటిలో ఫ్రీ రాడికల్స్ ను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కాబట్టి అరటి పువ్వును ప్రతిరోజూ కషాయంలా చేసుకొని సేవిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు దురమౌతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ కారణంగా సుఖ విరోచనలు కలుగుతాయి.
Also Read:సభ వాయిదా..మరి ప్రియాంకగాంధీ సంగతేంటి?
కాబట్టి మలబద్దక సమస్య ఉండదు. ఇంకా అరటి పువ్వు కషాయం తాగితే పురుషులకు ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. ఈ కషాయం పురుషుల్లో వీర్యకణాల వృద్దిని పెంచుతుందట. ఇక మహిళల్లో గర్భాశయ సమస్యలను దూరం చేస్తుంది. ప్రగ్నెన్సి సమయంలో వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకు అరటిపువ్వు కషాయం చక్కటి పరిష్కారాన్ని అందిస్తుందని ఆయుర్వేధ శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకా అరటిపువ్వు కషాయం ప్రతిరోజూ తాగడం వల్ల నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందట. కాబట్టి అరటిపువ్వును నిర్లక్ష్యం చేయవద్దని ఆయా సమస్యలు ఉన్నవాళ్ళు దీనిని కాషాయ రూపంలోగాని లేదా కూరల ద్వారగని తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read:వర్షాలను రాజకీయం చేయొద్దు: కేటీఆర్