హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్..

51
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా భారీ, అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు,వంకలు పొంగిపొర్లుతుండగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తాయి. ఇక ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

చార్మినార్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కూకట్‌పల్లి జోన్‌కు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేసింది.ఇక రేపు కూడా ఐదు జోన్ల పరిధిలో ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.

Also Read:అగ్రనేతల పోటాపోటి టూర్స్..!

గంటకు 3 నుంచి 5 సెం.మీ. వర్షం కురిసే అవకాశం ఉందని.. కొన్నిసార్లు 5 నుంచి 10 సెం.మీ. కూడా కావచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 10 నుంచి 14 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. శుక్ర, శనివారాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు అధికారులు.

ఇక భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఇవాళ,రేపు రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు సీఎం కేసీఆర్.

Also Read:కార్గిల్ విజయ్ దివస్..వీర జవాన్ల యాదిలో

- Advertisement -