‘బ్రో’లో మరో రెండు పాటలు కూడా

41
- Advertisement -

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ కలయికలో రాబోతున్న చిత్రం ‘బ్రో’. తమిళ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే 2 పాటలు విడుదలయ్యాయి. వీటితో పాటు మరో 2 పాటలు కూడా ఉన్నట్లు సమాచారం. బ్రో సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు హిట్ టాక్‌ ని సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ 25న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ఈవెంట్ లో మిగిలిన పాటలను కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

జులై 28న ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాకి సముద్రఖని డైరెక్షన్ చేయగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ ప్లే అందించారు. ఆల్ రెడీ ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లో పవన్‌ పంచ్‌ డైలాగ్‌లు, తేజ్‌ రియాక్షన్స్‌ ఆద్యంతం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది. దాంతో ఈ ట్రైలర్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. భారీ కలెక్షన్లు వస్తాయని అంటున్నారు. పైగా పవన్ కళ్యాణ్ నుంచి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా ఇది.

Also Read:Pushpa 2:ఇంట్రెస్టింగ్ న్యూస్

అలాగే విరూపాక్ష లాంటి హిట్ తర్వాత అటు సాయి తేజ్ నుంచి కూడా వస్తున్న సినిమా ఇదే. అందుకే, ఈ సినిమాకి భారీగానే జరిగింది. ఇక బ్రో సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించింది. టీమ్ ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమోషన్స్ లో జాయిన్ కానున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ను సాధిస్తుందో చూడాలి. అన్నట్టు బ్రో సినిమా వినోదాయ సిత్తంకు రీమేక్‌గా రాబోతుంది.

Also Read:ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

- Advertisement -