రాజమౌళి..రైతులను ఆదుకుంటాడా..!

196
Rajamouli is Help for Formers..!
- Advertisement -

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ సినీరంగ చరిత్రలో మరే చిత్రానికీ సాధ్యం కాని మహాద్బుతాన్ని రాజమౌళి తీసిన బాహుహలి2 సృష్టించింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి ఇప్పటివరకు ఉన్న  భారతీయ సినిమా రికార్డుల్ని చెరిపివేస్తూ అఖండ ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్నది. భాషా భేదాలతో సంబంధం లేకుండా ఈ చిత్రానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా వెయ్యికోట్ల మైలురాయిని సునాయసంగా అధిగమిస్తుందని సినీ, మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే రూ. 500కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేసింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. బాహుబలి సినిమా సందర్భంగా అందరినోటా ఒక్కటే మాట.. కట్టప్ప బాహుబలిని ఎందుకు సంహరించాడని. అలా సంభాషించిన వారిలో యువతీయువకులు, విద్యావంతులు, ఉద్యోగులతోపాటు రైతులు, రైతు కుటుంబాలు కూడా ఉన్నాయి. సినిమా గురించి ఎంత ఎక్కువగా మనం చర్చించుకుంటున్నామో అంతలా అన్నం పెట్టే రైతులు నష్టాల్లో కూరుకుపోయి ఉరివేసుకుని చనిపోతుంటే ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని, అసలు రైతు అనే వ్యక్తిని గురించి ఒక్కసారి ఆలోచించాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చర్చనీయశంగా మారింది.

సినిమా కథాంశంలో బాహుబలి పేదల పక్షపాతి అని అలాగే పేద రైతుల పట్ల కరుణ చూపి రాజమౌళి రియల్ బాహుబలి కావాలని వందలాది సోషల్ మీడియా వలంటీర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరి దీనిపై జక్కన్న ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.

ఇక ఇదిఇలా ఉండగా గతంలో మహారాష్ట్రను కరువు రక్కసి చుట్టుముట్టినప్పడు బాలీవుడ్ హీరోలు బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ రెండు గ్రామాలను దత్తత తీసుకోగా  లాతూరు, ఉస్మానాబాద్ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు నానా పటేకర్ రూ. 15వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు.

మరాఠ్వాటా ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకున్న 180 రైతు కుటుంబాలను అక్షయ్‌ కుమార్‌ ఆదుకున్నాడు. దీని కోసం ఆయన దాదాపు 90 లక్షలు ఖర్చు చేశాడు. ఈ విషయంలో మాత్రం అక్షయ్‌ పబ్లిసిటీని కోరుకోవడం లేదు.  బాలీవుడ్ సుందరి ప్రీతి జింటా సైతం  తన పెళ్లి ఫోటోలను వేలం వేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని.. మహరాష్ట్రలోని కరువు బాధితులకు అందజేసి ఉదారతను చాటుకున్నారు.

- Advertisement -