బేబీ… అంటే అర్థమేంటి..? బాగా ముద్దు వస్తే పెట్టుకునే పేరు అది. ముఖ్యంగా తమ ప్రేయసిని కుర్రాళ్ళు పేమగా బేబీ అని పిలుచుకుంటారు. ఐతే,ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన ‘బేబీ’ సినిమా పుణ్యమా అని.. ఇప్పుడు ఏ ప్రేమికుడూ తన ప్రేయసిని ముద్దుగా బేబీ అని పిలుచుకోలేడు. ఆ స్థాయిలో అందమైన బేబీ పదాన్ని మోసాల వనిత యొక్క పర్యాయపదంగా మార్చేశారు. ప్చ్… ఆల్ రెడీ తమ లవర్ ని బేబీ అని పిలుచుకోవడం అలవాటు అయిపోయిన జంటలకు అయితే, ఈ పదం ఇప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తోందట. ఏమిటో.. సినిమాల ప్రభావం యువత పై పడుతుంది అని విన్నాం, కానీ ‘ఒక సినిమా పేరు’ కూడా ఈ స్థాయిలో ప్రభావితం చేస్తోందని ఊహించలేదు.
సరే, కథ అంటే కథే… కల్పనే కదా… కానీ ఈ కథను కూడా స్ట్రెయిట్‌గా చెప్పకుండా బేబీ అనే అమ్మాయి అవకాశ వాది, ఈ తరంలో అమ్మాయిలు అంతా అలాగే ఉన్నారు అని దర్శకుడు చెప్పాలనుకున్నాడు. ఇక్కడే తేడా కొడుతోంది. సినిమా అయితే హిట్ అయింది. కానీ, ఈ సినిమా చూశాక, లవర్స్ మధ్య బంధాలకు బీటలు వారే ప్రమాదం లేకపోలేదు. ఏది ఏమైనా బేబీ అనే పదాన్ని వాడడానికి ఇప్పుడు లవర్స్ భయ పడుతున్నారు. ఇక బేబీ సినిమా విషయానికి వస్తే.. బేబీ మూవీ సరికొత్త రికార్డు సృష్టించింది.
Also Read:తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ..దాశరథి
అవును, మీరు విన్నది నిజమే. మిడ్ రేంజ్ సినిమాల్లో అత్యంత వేగంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ మేరకు మేకర్స్ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ నెల 14 విడుదలైన ఈ సినిమా 8 రోజుల్లోనే రూ.50 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీని SKN నిర్మించారు. మొత్తమ్మీద ఆనంద్ దేవరకొండకి సాలిడ్ హిట్ పడింది. వైష్ణవి చైతన్యకి భారీ బ్రేక్ దొరికింది. అటు విరాజ్ అశ్విన్ కి కూడా ఇమేజ్ పెరిగింది. ఇదంతా బేబీ మహత్యమే.
Also Read:పెళ్లికి ముందే ఆ కండిషన్ పెట్టాడట