వైసీపీలో వర్గ ” పోరు “..?

40
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఈ మద్య చాలా నియోజిక వర్గాల్లో స్థానికంగా ఉన్న పార్టీనేతల మద్య వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. తాజాగా కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజిక వర్గానికి సంబంధించి ఓ ఇద్దరి నేతల మద్య టికెట్ వార్ కొనసాగుతోంది. ఈ నియోజికవర్గానికి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈయన ఇదే నియోజిక వర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఇటీవల స్పష్టం చేశారు. ఇక్కడే అసలు చిక్కు ఏర్పడింది. రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తన కొడుకు సూర్యప్రకాశ్ కు ఇదే నియోజిక వర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. .

దీంతో ఇద్దరు వైసీపీ నేతల మద్య టికెట్ వార్ పెరిగి పెద్దదైంది. గత ఎన్నికల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ మద్దతు మేరకే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారని పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం చెబుతోంది. ఈసారి ఆయన కుమారుడికి టికెట్ దక్కకుండా వేణుగోపాల కృష్ణ అడ్డుపడితే.. సహించేది లేదని పిల్లి వర్గం నుంచి గట్టిగానే హెచ్చరికలు వస్తున్నాయి. అటు చెల్లుబోయిన టికెట్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెబుతున్నారు దీంతో ఈ ఇద్దరిలో జగన్ ఎవరికి టికెట్ కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక నిన్న మొన్నటి వరకు నెల్లూరులో కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు రూప్ కుమార్ లా మద్య ఇదే విధమైన వర్గపోరు కొనసాగింది. అలాగే నందికొట్కూరు నియోజిక వర్గంలో బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి మరియు ఎమ్మెల్యే ఆర్థర్ మద్య కూడా ఈ రకమైన వర్గపోరు ఎప్పటి నుంచో నడుస్తోంది. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడే కొద్ది నియోజిక వర్గాల వారీగా వైసీపీని వర్గపోరు కలవరపెడుతోంది.

Also Read:రేవంత్ కు పొంగులేటి ఎఫెక్ట్ ?

- Advertisement -