సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మిత్రపక్షాలపై బీజేపీ దృష్టి సారించింది. అసలే బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకమౌతున్న వేళ ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన మిత్రపక్షాలు కూడా దూరమయ్యే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. అందుకే ఈ నెల 18న ఎన్డీయే మిత్రపక్ష కూటమిని ఏర్పాటు చేస్తున్నారు బీజేపీ పెద్దలు. ఈ సమావేశం కొరకు 30 పార్టీలకుపైగా ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఎన్డీయే కు మిత్రా పక్షంగా వ్యవహరించిన జేడీఎస్, ఎన్సీపీ వంటి పార్టీలు ఎలా అడుగులు వేస్తాయనేది పోలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.
కర్నాటక నుంచి జేడీఎస్ పార్టీకి ఆహ్వానం అందిందని, ఆ పార్టీ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరబోతుందని పోలిటికల్ సర్కిల్స్ లో వార్తలు తెర చక్కర్లు కొట్టాయి. తాజాగా వైరల్ అవుతున్న వార్తలకు జెడిఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి స్పస్టతనిచ్చారు. తమకు ఎన్డీయే మిత్రపక్ష సమావేశానికి సంబంధించి ఎలాంటి ఆహ్వానం అందలేదని చెప్తూ జెడిఎస్ ను ఎన్డీయే భాగస్వామిగా బీజేపీ భావించట్లేదు అని చెప్పుకొచ్చారు. దీంతో ఎన్డీయే కూటమిలో జేడీఎస్ ఉండే అవకాశం లేదని తేలిపోయింది. ఇక ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎన్సీపీ గతంలో బీజేపీకి పరోక్షంగా మద్దతు పలుకుతూ వచ్చింది.
Also Read:ఆ సమస్య ఉంటే..అల్లం తినొద్దు
కానీ ఎవరు ఊహించని విధంగా ఆ పార్టీ రెండుగా చిలిపౌయింది. ఎన్సీపీ చీలికలో బీజేపీ ఉందనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో శరత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎన్డీయేలో చేరుతుందా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఎన్డీయేలో చేరికపై ఎన్సీపీ అధినేత శరత్ పవార్ స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని పవార్ తేల్చి చెప్పారు. దీంతో ఎన్డీయే కూటమిలో ఎన్సీపీ లేదనే విషయం స్పష్టమైంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నేడు ముంబై లో జరుగుతున్నా విపక్షాల కూటమికి కూడా శరత్ పవార్ గైర్హాజరు కావడం గమనార్హం. మొత్తానికి ఎన్సీపీ ( శరత్ పవార్ వర్గం ), జెడిఎస్ పార్టీలు ఎన్డీయేలో చేరడం లేదని స్పష్టమైంది.
Also Read:డెబిట్ కార్డ్ తో పని లేకుండా..డబ్బు విత్ డ్రా!