డెబిట్ కార్డ్ తో పని లేకుండా..డబ్బు విత్ డ్రా!

31
- Advertisement -

నేటి రోజుల్లో క్యాష్ లెస్ పేమెంట్స్ వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చేతిలో డబ్బు లేకపోయిన మొబైల్ లోని యూపీఐ పేమెంట్స్ ద్వారా ఏది కావాలంటే అది కొనుకుంటూ ఉంటాము. ఈ క్యాష్ లెస్ పేమెంట్స్ వాడకం ద్వారా ఏ‌టి‌ఎం ద్వారా డబ్బు విత్ డ్రా తీసుకోవాల్సిన పని లేకుండా పోయింది. అయితే అన్నీ చోట్ల క్యాష్ లెస్ పేమెంట్స్ చేయడానికి వీలు పడదు. అలాంటప్పుడు ఏ‌టి‌ఎం ల వద్దకు పరుగెడుతుంటాము. అయితే ఏ‌టి‌ఎంలో డబ్బు తీసుకోవాలంటే డెబిట్ కార్డ్ తప్పనిసరి. ఒకవేళ డెబిట్ కార్డ్ మర్చిపోతే డబ్బు తీసుకోలేము. అయితే సమస్య నుంచి బయట పడేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ లేకుండానే మనీ విత్ డ్రా చేసుకునే విధానాన్ని ప్రవేశ పెట్టింది.

ఎస్‌బి‌ఐ కస్టమర్ల కోసం ఆ సంస్థ యోనో యాప్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వార డెబిట్ కార్డ్ లేకపోయినప్పటికి ఏ‌టి‌ఎం ద్వారా డబ్బు విత్ డ్రా తీసుకోవచ్చు. అందుకోసం మీ యొక్క మొబైల్ నెంబర్ నెట్ బ్యాంకింగ్ లింక్ అయి ఉండాలి. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్‌బి‌ఐ యోనో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత నెట్ బ్యాంకింగ్ కు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత ఎటిఎం వద్దకు వెళ్ళి అక్కడ యోనో క్యాష్ ఎంచుకోవాలి. అప్పుడు స్క్రీన్ పై ఒక క్యూ ఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ తరువాత మొబైల్ లోని యోనో యాప్ ఓపన్ చేసి స్కాన్ క్యూ ఆర్ కోడ్ ఎంచుకుని ఏ‌టి‌ఎం పై ఉన్న కోడ్ ను స్కాన్ చేయాలి. తరువాత మనం ఎంత డబ్బు విత్ డ్రా చేసుకోవాలో ఎంచుకొని కన్ఫర్మ్ చేయాలి. తరువాత మొబైల్ కు ఓటిపి వస్తుంది. ఓటిపిని ఏ‌టి‌ఎం స్క్రీన్ పై ఎంటర్ చేస్తే డబ్బు విత్ డ్రా అవుతుంది. ఇలా ఎస్‌బి‌ఐ యూజర్లు డెబిట్ కార్డ్ లేకపోయిన డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.

Also Read:ఆ సమస్య ఉంటే..అల్లం తినొద్దు

- Advertisement -