- Advertisement -
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్…మంత్రి హరీశ్ రావుతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని హాస్పిటల్, తదితర వైద్య సదుపాయాల విషయంపై హరీష్ రావుతో చర్చించారు. ఇక వీరిద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే తాను పార్టీ మారే ప్రసక్తేలేదని…అవసరమైతే రాజకీయ సన్యాసం చేస్తానని తెలిపారు.
కేవలం గోషా మహల్ నియోజకవర్గంలో హాస్పిటల్ అభివృద్ధికోసం హరీష్‌రావును కలిశానని తెలిపారు. గోశామహల్‌లో ఉన్న హాస్పిటల్‌ను 30 పడకలు లేదా 50 పడకలుగా అభివృద్ధి చేయాలని కోరానని తెలిపారు.
Also Read:నింగిలోకి చంద్రయాన్ -3
నేను ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి ఇప్పటి వరకు అడుగుతూనే ఉన్నానని తెలిపారు. ఇప్పటికి ఇద్దరు ఆరోగ్య శాఖ మంత్రులను కలిశా, హరీష్ రావు మూడో మంత్రి అని చెప్పారు రాజాసింగ్.
Also Read:త్రివిక్రమ్ బజ్ ఎలా క్రియేట్ చేస్తాడో?
- Advertisement -