Purandheswari:జనసేన ఎప్పటికీ మిత్రపక్షమే ..

34
- Advertisement -

పవన్ కల్యాణ్‌ జనసేన ఎప్పటికి తమకు మిత్రపక్షమే అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడిన ఆమె…పొత్తుల అంశం కేంద్ర పార్టీ చూసుకుంటుందని చెప్పారు.ఏపీలో పార్టీని బలోపేతం చేయడమే మా లక్ష్యం అన్నారు.

కార్యకర్తలందరినీ కలుపుకొని పార్టీ బలోపేతంకోసం కృషిచేస్తానని చెప్పారు. అభివృద్ధి‌కి పెద్దపీట వేస్తూ అవినీతికి దూరంగా ఉండే పార్టీ బీజేపీ పార్టీ అని …ఏపీలో బీజేపీపై దుష్ప్రచారం జరుగుతుందని అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ప్రతి రైతుకు 12వేలు ఇస్తామన్నారు. ఆ మేరకు ఇస్తున్నారా? సిఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏపీలో జాతీయ రహదారుల 8623 కిలో మీటర్లకు 1 లక్షా 15 వేల కోట్లు నిర్మాణాలకు కేంద్రం కేటాయించిందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రహదారులు వేసిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలోని నిమ్స్‌ను పట్టించుకోవడం లేదు. ఎన్ఆర్‌జీపీ కింద 2022-23 వరకు ఎనిమిది వేల కోట్లకు పైగా వచ్చాయన్నారు.

Also Read:‘మహావీరుడు’ కథ ఇదేనా!

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 46,836 కోట్లు గ్రాంట్లు ద్వారా రాష్ట్రానికి అందిస్తుందని…. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నేరుగా సర్పంచ్‌ల అకౌంట్‌లలోకి నిధులు విడుదల చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పక్కదారి పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.నాసిరకం మద్యం‌ను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను ప్రభుత్వం హరిస్తుందని ఆరోపించారు.

- Advertisement -