రాజకీయాలు అనగానే హీరో పై ఫైన్

41
- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌‌ కి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. గత మంగళవారం విజయ్ కార్యకర్తల సమావేశం కోసం చెన్నై సమీపంలోని పనైయూరులోని విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కరై ప్రాంతంలో విజయ్ కారు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసింది. కొందరు దాన్ని వీడియో తీయగా, వీడియోపై స్పందించిన గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు కారుకు రూ.500 ఫైన్ వేశారు. విజయ్ సిబ్బంది ఫైన్ పే చేసింది. విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే హీరో విజయ్ పాదయాత్రకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, అభిమాన సంఘం సభ్యులతో భేటీ అయిన విజయ పాదయాత్రపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ అనగానే తమిళనాడు ప్రభుత్వం విజయ్ పై సీరియస్ గా ఉంది.

Also Read:స్వరాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవం:ఎర్రబెల్లి

మరి విజయ్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఎలా తట్టుకుని నిలబడతారో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్ దళపతి, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన స్నేహితుడు మూవీ సూపర్ హిట్ అయింది. తాజాగా ఈ కాంబో మరోసారి రిపీట్ కానుందని తెలుస్తోంది. ఈ మూవీ పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే శంకర్ విజయ్ కు కథ వినిపించాడని, విజయ్ కూడా ఓకే అన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read:Nani:’hi నాన్న’

- Advertisement -