ఆ చిన్న సినిమాకి 40 కోట్లు..గ్రేట్

84
- Advertisement -

‘సామజవరగమన’ సినిమా చిన్న చిత్రంగా వచ్చి పెద్ద హిట్ అందుకుంది. శ్రీవిష్ణు, రెబల్ మోనికా జాన్ జంటగా నటించిన ఈ సినిమా జూన్ 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాన్ స్టాప్ ఎంటర్టయినర్ గా ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసింది. 12 రోజుల్లో ఈ సినిమా 40 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. పైగా శ్రీవిష్ణు కకెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం. నిజానికి ఈ సినిమాకి ముందు శ్రీ విష్ణు పని అయిపోయింది అన్నారు. కానీ ఒక్క సినిమాతో మిడ్ రేంజ్ హీరోల సరసన ఇప్పుడు శ్రీ విష్ణుకి ప్లేస్ దక్కింది.

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరిగా చేరాడు. సామజవరగమన మూవీ సూపర్ హిట్ టాక్‌ కారణంగానే శ్రీవిష్ణుకి కాలం కలిసి వచ్చింది. నిజానికి ఈ సినిమా హీరో సందీప్ కిషన్ చేయాల్సింది. కానీ, యాక్షన్ హీరో అయిపోవాలనే ఆశతో ఇంత మంచి సినిమాని సందీప్ కిషన్ వదులుకున్నాడు. ఏది అయితే ఏం.. సామజవరగమన’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విడుదలై 12 రోజులైనా థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

పాజిటివ్ మౌత్ టాక్‌తో ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెబా మోనికా హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నరేష్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్‌ కోసం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ నెల 22 లేదా 25న ఓటీటీ‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై మరింత క్లారిటీ త్వరలో రానుంది. అన్నట్టు సీనియర్ నరేష్ పాత్ర కూడా సినిమాలో బాగా పేలింది.

Also Read:టీజర్ అదిరింది.. కానీ బజ్ రాకపాయే!

- Advertisement -