హిందీ బిగ్ బాస్, ఫియర్ ఫ్యాక్టర్ వంటి షోలలో కూడా ఫేమస్ అయిన నటి కశ్మీరా షా. 2003లో బ్రాడ్ లిట్టర్ మాన్ ను పెళ్లాడింది. ఆ తర్వాత వీరు 2007లో విడిపోయారు. ఆ తర్వాత 2013లో టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్ ను పెళ్లి చేసుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా రెండో భర్తతో తాను పిల్లల కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదని, చివరకు హీరో సల్మాన్ ఖాన్ సలహాతో సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లినయ్యానని కశ్మీరా షా తెలిపింది. అయితే, ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసలు సల్మాన్ ఖాన్ ఎందుకు కశ్మీరా షాకి సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలను కనమని సలహా ఇచ్చాడు అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే, సల్మాన్ ఖాన్ ఈ సలహా ఇవ్వడానికి గల కారణం మాత్రం షాక్ కి గురి చేస్తోంది. సల్మాన్ ఖాన్ ను పర్సనల్ గా కలిసి.. తనకు పిల్లలు కలగలేదు అని, మీ కారణంగా తాను తల్లిని కావాలని కోరికగా ఉందని కశ్మీరా షా రిక్వెస్ట్ చేసిందట. సహజంగా ఇలాంటి బోల్డ్ భామలకు దూరంగా ఉండే సల్మాన్ ఖాన్, కశ్మీరా షాకు సరోగసి సలహా ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కశ్మీరా షా పై విరుచుకు పడుతున్నారు. కశ్మీరా షా నువ్వు వేసిన ఎత్తులు మా హీరో దగ్గర పారవు అంటూ ఆమెను తిడుతున్నారు.
మరికొందరు నెటిజన్లు అయితే ఇంకా సీరియస్ అవుతున్నారు. సల్మాన్ ఖాన్ ను ట్రాప్ చేసి అతనితో పిల్లలను కని.. వారిని సల్మాన్ ఖాన్ వారసులుగా ప్రకటించాలని నువ్వు బాగా ఆశ పడ్డావు. కానీ నీ అత్యాశను గమనించలేని అమాయకుడు కాడు మా హీరో అంటూ సల్మాన్ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.
Also Read:‘ఘోస్ట్’… ‘బిగ్ డాడీ’ టీజర్