టీజర్ అదిరింది.. కానీ బజ్ రాకపాయే!

46
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాండీవధారి అర్జున మూవీ నుంచి ప్రీటీజర్ విడుదలైంది. పవర్ ఫుల్ షాట్ మేకింగ్ తో.. భారీ యాక్షన్ బిల్డప్ తో వరుణ్ తేజ్ టీజర్ లో బ్లాక్ షేడ్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రవీణ్ సత్తారు మేకింగ్ స్టైల్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ తాలూకు ర్యాంప్ షాట్స్ ను ప్రవీణ్ సత్తారు చాలా బాగా కట్ చేశారు. అలాగే ఎస్టాబ్లిష్ చేశారు. టీజర్ అదిరిపోయిందని మెగా ఫ్యాన్స్ కూడా వరుణ్ తేజ్ కి ట్వీట్స్ చేస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, ఆగస్ట్ 25న మూవీ రిలీజ్ కానుంది. అయితే, ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమా పై ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. సినిమాలో మ్యాటర్ ఉందని మేకర్స్ ఎంత బిల్డప్ ఇస్తున్నా.. ఎందుకో వరుణ్ తేజ్ ను యాక్షన్ హీరోగా చూడలేకపోతున్నారు. వాస్తవానికి వరుణ్ తేజ్ కి యాక్షన్ కథలు బాగా సెట్ అవుతాయి. ఆ రేంజ్ కటౌట్ అతనికి ఉంది. కాకపోతే.. ఆ రేంజ్ స్టార్ డమ్ నే వరుణ్ తేజ్ సాధించలేక పోయాడు.

Also Read:రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలంగాణ..

దీనికితోడు గాండీవధారి అర్జున అనే టైటిల్ కూడా మాస్ ఆడియన్స్ ను ఈ సినిమాకి దూరం చేసేలా ఉంది. ఈ నేపథ్యంలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీ టీజర్ బాగానే ఆకట్టుకుంది. కాబట్టి.. సినిమాకి కచ్చితంగా ఈ టీజర్ ప్లస్ అవుతుంది. ఎంతైనా దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ పై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. మరి చివరకు వరుణ్ తేజ్ కి ఈ సినిమా ఏ స్థాయి హిట్ ను అందిస్తోందో చూడాలి.

- Advertisement -