భారత్‌ – వెస్టిండీస్‌ తొలి టెస్టు

39
- Advertisement -

ఇవాళ్టి నుండి భారత్ – వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత విండీస్‌తో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌ చేయనుండగా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ తొలి సారి టెస్టు జట్టుకు ఎంపిక కాగా వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి.

రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌ ఆల్‌రౌండర్ల కోటాలో చోటు దక్కించుకోనుండగా మహమ్మద్‌ సిరాజ్‌ పేస్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. వెస్టిండీస్‌ 13 మందితో కూడిన జట్టును ప్రకటించగా ఇందులో ఎక్కువ శాతం కొత్త ప్లేయర్లకు అవకాశం దక్కింది.

Also Read:#Nani30 ఫస్ట్ లుక్ అప్‌డేట్

జట్లు…అంచనా

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌, యశస్వి, కోహ్లీ, రహానే, భరత్‌, జడేజా, అశ్విన్‌, శార్దూల్‌, సిరాజ్‌, ముఖేశ్‌.

వెస్టిండీస్‌: బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), టగ్‌నరైన్‌ చందర్‌పాల్‌, రైమాన్‌, బ్లాక్‌వుడ్‌, చేజ్‌, జోషువా, రాకీమ్‌ కార్న్‌వాల్‌, హోల్డర్‌, గాబ్రియల్‌, అల్జారీ జోసెఫ్‌, కిమారో రోచ్‌.

- Advertisement -