రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ చైర్మన్ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన జన్మదిన పురస్కరించుకొని శ్రీ సాయి విజ్ఞాన భారతి హై స్కూల్ విద్యార్థులు మరియు పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు ఓయూ గిరిజన రాష్ట్ర నేత డాక్టర్ బానోతు సంజీవ్ నాయక్.
ఈ సంధర్బంగా డాక్టర్ బానోతు సంజీవ్ నాయక్ మాట్లాడుతూ అడవులను ,ప్రకృతిని గ్రీన్ ఇండియా చాలెంజ్ తో జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని హరితహారం చేయడం గొప్ప విషయం. భావితరాలకు స్ఫూర్తిని అందించే గొప్ప కార్యక్రమం అని అన్నారు ఇలాంటి కార్యక్రమాన్ని స్పూర్తి గా తీసుకొని ప్రపంచం అంత మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాయి విజ్ఞాన భారతి హై స్కూల్ కరస్పాండెంట్ డా.శశిధర్ రెడ్డి ,డైరెక్టర్ ముస్కు రోజా శ్రీకాంత్ రెడ్డి, స్వరూప, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Also Read:మనోజ్ కృష్ణ..’నిన్ను చేరే తరుణం’

