రాష్ట్రంలో రానున్న 5 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలతో పాటు జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని…13,14వ తేదీలతో పాటు 15వ తేదీ కూడా రాష్ట్రంలోని పలుచోట్ల స్వల్ప వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
Also Read:సామ్ ఎమోషనల్..6 నెలలు ఎలా!
దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్ధాయిలో వర్షాలు కురుస్తున్నాయి. 41 ఏండ్ల గరిష్టస్ధాయిలో వర్షపాతం నమోదైంది. 1982 తర్వాత ఈ స్ధాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారి. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లన్ని జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వానలకు యమునా నదికి వరద పోటెత్తింది. వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరడంతో ఢిల్లీలో ప్రమాదం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Also Read:ఆ దర్శకుడిపై హేమామాలిని సంచలన కామెంట్స్!