ఘనంగా లష్కర్ బోనాలు…

65
- Advertisement -

లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం.
తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు.

ఇక అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుండే భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ఇక సీఎం కేసీఆర్ సైతం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బోనాల పండగ నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం నగరంలో ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. నగరంలో దాదాపు 19 ప్రాంతాల నుంచి బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాలకు భక్తులు చేరుకునే విధంగా సిటీ బస్సులను తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Also Read:CM KCR:మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ బేటీ’ బంధం

- Advertisement -