చింత చిగురు గురించి తెలియని వాళ్ళు ఉంటారు. సీజనల్ గా ఆకు రాలుకాలం తరువాత తొలకరి వర్షాలకు చింత చెట్టుకు కాచే లేలేత ఆకులనే చింతచిగురు అంటారు. దీన్ని కూరల్లో విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో చింతచిరుగుతో పప్పును చాలమంది లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. చింత చిగురుకు ఉండే సహజమైన పులుకు కారణంగా కూరల యొక్క రుచి రెట్టింపు అవుతుంది. కాబట్టి వర్షాకాలంలో చింతచిగురు తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు. కాగా చింతచిగురు కేవలం కూరల రుచిని పెంచడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలుగజేస్తుంది.; .
ముఖ్యంగా చింతచిగురులో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి12 .. వంటి వాటితో పాటు యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు రోగ నిరోదక శక్తి పెంచుతుంది. ముఖ్యంగా చింతచిగురుతో చేసిన వంటకాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు దురమౌతాయి. కడుపులో నులి పురుగులతో బాధ పడే వాళ్ళు చింతచిగురు రసం పడగడుపున తాగితే వాటి నుంచి విముక్తి పొందవచ్చని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి. చింతచిగురును ఉడికించి ఆ నీటిని ప్రతిరోజూ నోట్లో వేసుకొని పుక్కలించడం వల్ల నోటి దుర్వాసన దురమౌతుంది.
Also Read: తమలపాకు తింటే ఎన్ని ఉపయోగాలో..!
అంతేకాకుండా నోటిపూత, గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా దురమౌతాయట. థైరాయిడ్ తో బాధపడే వాళ్ళు తప్పకుండా వారు తినే ఆహారంలో చింతచిగురు ఉండేలా చూసుకుంటే.. ఆ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా వివిధ క్యాన్సర్ కారకాలను నివారించే గుణాలు కూడా చింతచిగురుకు ఉన్నాయని పలు అద్యయానాలు చెబుతున్నాయి. ఇంకా గుండె జబ్బులను దూరం చేయడంలోనూ, కీళ్ల నొప్పులను తగ్గించడం లోనూ చింతచిగురు ఎంతగానో సహాయ పడుతుందట. చింత చిగురును కషాయంలా చేసుకొని తాగితే మధుమేహం కూడా అదుపులోకి వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సీజనల్ గా మాత్రమే లభించే చింతచిగురును అసలు వదలకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు.