తమలపాకు తింటే ఎన్ని ఉపయోగాలో..!

81
- Advertisement -

తమలపాకు గుయించి మనందరికి తెలిసే ఉంటుంది. రుచికరమైన భోజనం చేసిన తరువాత పాన్ రూపంలో తపాలపకును తింటూ ఉంటారు చాలమంది. ఇంకా చెప్పాలంటే పూర్వం నుంచి కూడా తమలపాకును తినడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. చాలమంది తమలపాకులో పోక, సున్నం కలుపుకొని తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. అయితే ఒట్టి తమలపాకు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తమలపాకును వివిధ వ్యాధులకు ఔషద మొక్కగా కూడా ఉపయోగిస్తారు. ఒట్టి తమలపాకు తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది..

ఇంకా మలబద్దకం వంటి సమస్యలు కూడా దూరమౌతాయి. ప్రతిరోజు తమలపాకు ను నోట్లో వేసుకొని నమలడం వల్ల నోటి దుర్వాసన, దంతక్షయం, చిగుళ్ళ నొప్పులు, నోటి ఇన్ఫెక్షన్స్ వంటి అన్నీ దురమౌతాయట. ఇందుకంటే తమలపాకులో ఉండే యాంటీ మైక్రోబాయల్ ఏజెంట్లు నోటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. ఇంకా వర్షాకాలంలో తరచూ వేదించే సమస్యలు అనగా జలుబు, దగ్గు, వంటి వాటిని కూడా తమలపాకు తినడం వల్ల దూరం చేసుకోవచ్చు.

ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ను ఎదుర్కోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇంకా తమలపాకును మెత్తగా చూర్ణంలా చేసుకొని గాయాలపై రాసుకోవడం వల్ల ఆ గాయాలు త్వరగా మానిపోవడానికి అవకాశం ఉంటుంది. తమలపాకు చూర్ణాన్ని ప్రతిరోజూ ఒక స్పూన్ తేనెలో కలుపుకొని తాగడం వల్ల మధుమేహం కూడా అదుపులో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ డి, వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎన్నో అనారోగ్యలను ఎదుర్కొనేందుకు తగిన శక్తినిస్తాయి. కాబట్టి ఒట్టి తమలపాకు ప్రతిరోజూ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. అలా కాకుండా తమలపాకులో పోక, సున్నం వంటి వాటిని కలిపి తీసుకుంటే నోటి క్యాన్సర్ బారిన పడకతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:చౌర్య పాఠం…అదిరిపోతుంది

- Advertisement -