బలగం @100

45
- Advertisement -

తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం బలగం. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను మెజార్టీ గ్రామాల్లో ప్రదర్శించారంటే సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఈ సినిమాకు ఇప్పటివరకు అనేక అవార్డుల పంట పండగా వాటి లెక్క ఏకంగా సెంచరీకి చేసింది. దాదాపు 100కి పైగా ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది బలగం.

Also Read:రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు..

ఇదివరకు మన సినిమాలు 100 రోజులు, 100 సెంటర్లు, 100 కోట్లు కలెక్ట్‌ చేయడం వంటి రికార్డులను క్రియేట్‌ చేశాయి. కానీ 100కి పైగా అంతర్జాతీయ అవార్డుల సాధించిన ఘనతను అందుకుని ప్రత్యేకంగా నిలిచిందని చెప్పారు దర్శకుడు వేణు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. దిల్‌ రాజు బ్యానర్‌పై హన్షితా రెడ్డి తెరకెక్కించగా భీమ్స్‌ సిసిరోలియా సినిమాకు అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు.

Also Read:బండి సంజయ్‌పై లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్

- Advertisement -