మల్లన్న సన్నిధిలో మంత్రి హరీశ్..

48
- Advertisement -

సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామి దేవాలయ క్యూ-లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు మంత్రి హరీశ్‌ రావు. అనంతరం స్ధానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో కలిసి పట్నం వేసి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

కొమురవెళ్లి మల్లన్న దివ్య క్షేత్రంలో రూ.12 కోట్ల వ్యయంతో క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం అన్నారు హరీశ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొమురవెళ్లి మల్లన్న దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. కొమురవెళ్లి మల్లన్నకు ముఖ్యమంత్రి కేసిఆర్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాలయాభివృద్ధి భూమి పూజ చేసి, పట్టుదలతో తెలంగాణ సాధించి వచ్చి ఇతోధికంగా ఆలయ అభివృద్ధికై సంకల్పించారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు ఉండేవి కావు. దేవాలయ అభివృద్ధికై రూ.36 కోట్లు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టినట్లు వెల్లడించారన్నారు. మల్లన్న కల్యాణోత్సవంలో ఇచ్చిన హామీ మేరకు మల్లన్నకు బంగారు కిరీటం, వెండి తలుపులు, వెండి ముఖద్వారాలు చేయించినట్లు వెల్లడించారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని అతిపెద్ద మల్లన్న సాగర్ జలాశయం ప్రారంభించి, ఆ గోదావరి జలాలు తెచ్చి మల్లన్నకు కాళ్లు కడిగి సీఎం కేసీఆర్ గారు మొక్కు చెల్లించుకున్నారని గుర్తుచేశారు.

Also Read:మరోసారి విక్రమ్ కాంబో రిపీట్!
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించడంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంకు కల్పతరువుగా మారిందన్నారు. మొక్కు తీర్చుకొనేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేర రాజీవ్ రహదారి నుంచి ఆలయానికి వచ్చేలా రూ.10.30 కోట్లు నిధులతో డబుల్ లేన్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. దేవాలయ ఆవరణలోని గుట్టపై 100 గదులతో సత్రాలు త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నాం అన్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా రావు, ఇతర దాతల సహకారంతో దేవాలయ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్లాస్టిక్ రహిత దేవాలయంగా ఉండాలని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రయత్నం చేస్తున్నారని, ఇందుకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:పవార్‌తో మొదలు..పవార్‌తోనే ముగింపు

- Advertisement -