#VT13 యాక్షన్ షెడ్యూల్ పూర్తి..

62
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ #VT13 టీమ్ గత కొన్ని రోజులుగా అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఒక ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ రివిల్ చేసిన పోస్టర్‌లో వరుణ్ తేజ్ యుద్ధ విమానం ముందు నిలబడి ఉన్న IAF అధికారిగా కనిపించారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ కలిసి రూపొందిస్తున్న ఈ యాక్షన్ డ్రామా టైటిల్‌ను త్వరలో అనౌన్స్ చేస్తారు. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read:తెలంగాణకు చేయూతనివ్వండి:నిరంజన్ రెడ్డి

మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ ఈ చిత్రంలో రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో శరవేగంతో జరుగుతోంది. ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. వరుణ్ తేజ్ డాషింగ్ గా కనిపిస్తున్న కొన్ని స్టిల్స్ ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read:Chiranjeevi:’భోళా శంకర్’ షూటింగ్ పూర్తి

- Advertisement -