మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోలా శంకర్’ టీజర్‌లో తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపించారు. భోళా శంకర్‌లో చిరంజీవి పవర్‌ప్యాక్‌తో కూడిన పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.
“భోళా శంకర్ షూట్ పూర్తయింది. రాత్రి పగలు విరామం లేకుండా పని చేస్తున్న నటీనటులు & సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌తో జరుగుతున్నాయి. ప్రమోషన్‌లు & పాటలు విడుదల కాబోతున్నాయి. భోళా శంకర్ ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల. #BholaaShankar @KChiruTweets 🙏🌟 ”అని మెహర్ రమేష్ ట్వీట్ చేశారు.
Also Read:వరల్డ్ కప్ క్వాలిఫయర్..జింబాబ్వే ఔట్
సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. మిగిలిన పాటలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలౌతాయి. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ & తరుణ్ అరోరా
Also Read:సోంపు వాటర్…ఉపయోగాలు