SRK:షారుఖ్‌కు గాయాలు

41
- Advertisement -

బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ ఖాన్ గాయాలపాలయ్యారు. రీసెంట్‌గా పఠాన్ సినిమాతో హిట్ కొట్టిన షారుఖ్…ప్రస్తుతం జవాన్, డుంకి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక డుంకి సినిమా షూటింగ్‌ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరుగుతుండగా ఆయన తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

గాయపడిన షారుఖ్‌ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం చిన్నపాటి సర్జరీ కూడా అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షారుఖ్ రెస్ట్ తీసుకుంటుండగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.

Also Read:‘దేవ‌ర’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్

షారుఖ్‌కి ప్రమాద వార్త తెలుసుకుని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.

Also Read:విజయ్ ‘లియో’లో ఆర్ఆర్ఆర్ స్టార్!

- Advertisement -