ధీరోదాత్తనాయకుడు.. కే‌సి‌ఆర్ !

44
- Advertisement -

తన పోరాట స్పూర్తితో తెలంగాణ ప్రజల కలలు సాకారం చేస్తూ కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన పోరాట దీక్షా దక్షుడు మన ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్. రాష్ట్రం ఏర్పడిన తరువాత తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తూ ఇతర ఏ రాష్ట్రాలకు సాధ్యం కానీ విధంగా అన్నీ రంగాల్లోనూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారంటే అతిశయోక్తి కాదు. అటు సంక్షేమంలోనూ ఇటు అభివృద్ది లోనూ తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ఇతర రాష్ట్ర ముఖమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు సి‌ఎం కే‌సి‌ఆర్. నేడు గిరిజనుల కళ్ళలో ఆనందం నింపుతూ పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు సి‌ఎం కే‌సి‌ఆర్.

మొత్తం మీద 28 జిల్లాలోని, 2,845 గ్రామాలలో లబ్దిదారులకు పోడు భూములకు పట్టాలను అందనున్నాయి. 1,51,146 మందికి, 4,06,369 ఎకరాల భూమి పంపిణీ జరగనుంది. ఎన్నో ఏళ్లుగా తమ అస్థిత్వం కోసం గిరిజనులు పోరాడుతూ వచ్చారు. ముఖ్యంగా రిజర్వేషన్లు, పోడు భూములపై అధికారం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అడవి బిడ్డల గుర్తింపు కోసం సి‌ఎం కే‌సి‌ఆర్ ” మావ నాటే.. మావ రాజ్ ” ఏర్పాటు చేశారు. ఇప్పుడు జమీన్ ల పోరాటానికి ముగింపు పలుకుతూ పోడు భూమలకు పట్టాల పంపిణీ చేపడుతున్నారు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో గిరిజనుల గొంతుక వినిపించిన కొమరం భీమ్ జిల్లా నుంచి నేడు సి‌ఎం కే‌సి‌ఆర్ పోడు భూములకు పట్టాల పంపిణీ చేపట్టనున్నారు.

Also Read: Tamilnadu:గవర్నర్ ఆసాధారణ చర్య.. రాజ్యాంగ విరుద్ధం డీఎంకే..!

దీంతో సి‌ఎం కే‌సి‌ఆర్ పై అటు తెలంగాణ ప్రజానీకం హర్షద్వనులు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ” నీళ్ళు, నిధులు, నియమకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు.. జల్, జంగిల్, జమీన్..అని కొమరం భీమ్ కలలను అక్షరాల సాకారం చేసిన ధీరోదాత్త నాయకుడు మన ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్.. ” అంటూ ట్వీట్ చేశారు. మొన్న కొండకొనల్లో మిషన్ భగీరథ ద్వారా స్వచ్చమైన జలాలను ( జల్ ) ఇచ్చి, నిన్న రాష్ట్రం లో 7.70 శాతానికి పెరిగిన అడవులు ( జంగిల్ ) కాపాడుకుంటూ, నేడు 1.51 లక్షల మందికి ఏకంగా 4.60 లక్షల ఎకరాల పోడు భూముల పంపిణీ చేసి కొమరం భీమ్ కలలను సాకారం చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఒక్కడే అని చెప్పక తప్పదు. ఇదే విషయాన్ని మంత్రి కే‌టి‌ఆర్ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Also Read: KTR:కుమ్రం భీం కలలను సాకారం చేసిన నేత కేసీఆర్

- Advertisement -