తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సీఎం కార్యాలయం నుంచి పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. మధ్యాహ్నం 12.00 గంటలకు సిద్దిపేటలోని అగ్రికల్చర్ ఫామ్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి… మధ్యాహ్నం ఒంటి గంటకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సీఎం చేరుకుంటారు. అక్కడ గోండు వీరుడు, సాయుధ పోరాట యోధుడు కుమ్రం భీం విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. వారికి సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పిస్తారు. అనంతరం 1.25 గంటలకు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
జిల్లా కేంద్రంలో 1.50 గంటలకు చిల్డ్రన్ పార్క్లో కోట్నక్ భ్రీమావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వారికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం 2.10 గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. జిల్లా పరిపాలన కోరకు ఏర్పాటు చేయబడిన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయానికి 2.30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనున్నారు. భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. సాయంత్రం 5.05 గంటలకు హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమై 6.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు. 6.25 గంటలకు ప్రగతి భవన్కు చేరుకుంటారు. జిల్లా పోలీసు అధికారుల భవనాన్ని 51 వేల చదరపు అడుగుల్లో రూ.38.50 కోట్లతో నిర్మించినట్టు తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు.
Also Read: పవన్ ” శపథం ” నెరవేరుతుందా.. ?