ఉసిరిరసంతో ఎన్ని ప్రయోజనాలో!

80
- Advertisement -

ఉసిరికాయ గురించి మనందరికి తెలిసే ఉంటుంది. రుచిలో కాస్త ఒగరుగా, పుల్లగా ఉండే ఉసిరితో పచ్చడి, వేపుడు వంటివి చేసుకొని అరగిస్తూ ఉంటాము. ఉసిరిని కొందరు కచ్చపచ్చిగా కూడా తింటూ ఉంటారు. మరికొందరైతే ఉసిరిని జ్యూస్ లా చేసుకొని కూడా సేవిస్తూ ఉంటారు. అయితే ఉసిరికి ఉండే మిశ్రమ రుచి కారణంగా చాలా మంది ఉసిరిరసం సేవించడానికి వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఉసిరిరసం తాగడంవల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆగకుండా అసలు ఉండలేరు. మరి ఉసిరి ప్రయోజనాలెంటో తెలుసుకుందామా.. !

ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇంకా మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉసిరిలో పుష్కలంగా ఉంటాయి. అందుకే ఉసిరిని ఆయుర్వేదంలో వివిధ ఔషధల తయారీలో ఉపయోగిస్తుంటారు. వర్షాకాలంలోనూ వచ్చే సీజనల్ వ్యాధులను తగ్గించడంలో ఉసిరిరసం ఎంతగానో ఉపయోగ పడుతుంది. అంతే కాకుండా ప్రతిరోజూ ఉసిరి రసం తాగడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. ఇంకా చర్మ సౌందర్యాన్ని పెంచడంతో పాటు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఉసిరిరసం సేవిస్తే మలబద్దకం, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమై జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

ఇక ఉసిరిలో ఉండే ఆమ్లాలు, విటమిన్స్ శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా చూస్తాయి. తద్వారా బరువు తగ్గవచ్చు. ఇక ఉసిరి రసం తాగడం వల్ల మూత్ర విసర్జన సమయంలో వచ్చే సమస్యలు అనగా మంట, దురద, వంటి రుగ్మతలు తగ్గిపోయి మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే కిడ్నీలో రాళ్ళు కరిగేందుకు ఉసిరిరసం ఔషధంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఉసిరికాయలో విటమిన్ ఏ, కెరోటిన్ వంటి వాటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఉసిరిరసం తాగితే కంటిచూపు మెరుగుపడుతుందట. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఉసిరిరసం తాగితే అలసట, బద్దకం వంటివి దూరమై రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు ఉసిరి రసం ఎనర్జీ డ్రింక్ లా ఉపయోగ పడుతుందని పలు పరిశోదనల్లో వెల్లడైంది.

 అయితే ఉసిరిరసం ప్రతిరోజూ తాగడానికి వీలుపడదు. ఎందుకంటే ఉసిరికాయలు అన్నీ సీజన్లలో దొరకవు.. అయితే ఉసిరి సీజన్ వచ్చినప్పుడు తప్పకుండా ఉసిరిరసం ప్రతిరోజూ తాగాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:భార‌తీయుడు 2..ల‌వ్ మెలోడీ సాంగ్

- Advertisement -