గత కొన్నాళ్లుగా తెలంగాణ బీజేపీలో నేతల మధ్య విభేదాలు ఉన్నాయనే మాట తరచూ పోలిటికల్ సర్కిల్స్ లో వినబడుతోంది. బీజేపీ నేతలంతా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, కొందరి నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని, మరికొందరేమో ఆదిపత్యం కోసం పార్టీని గాలికి వదిలేశారని.. ఇలా రకరకాలుగా తెలంగాణ బీజేపీపై వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే పార్టీలోని ప్రస్తుత పరిణామాలు చూస్తే.. వైరల్ అవుతున్న వార్తలలో ఎంతో కొంత నిజం ఉండే అవకాశం లేకపోలేదు.
అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించి తాను అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఈటల అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారని, మరోవైపు ఇతరత్రా నేతలు దర్మపురి అరవింద్, రఘునందన్ వంటి వారు పార్టీలో ఏ మాత్రం యాక్టివ్ గా లేరని, బండి సంజయ్ ఏకపక్ష ఆదిపత్యం ప్రదర్శిస్తున్నారని అనే వాదనలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర బీజేపీలో ఏర్పడిన ముసలాన్ని తగ్గించేందుకే అధిస్థానం తరచూ తెలంగాణ టూర్ చేస్తోందనే మాట కూడా వినిపిస్తోంది. ఈ పరిణమాలన్నీ కూడా బీజేపీని ఎంతో కొంత డ్యామేజ్ చేసే విధంగానే ఉన్నాయని చెప్పక తప్పదు.
Also Read: DevendraFadnavis:సుశాంత్ మర్డర్‌పై కీలక ఆధారాలు..
ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఏపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ పై వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఉంది. ” బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమని.. చెప్పే ఉద్దేశంలో ఓ వీడియోని షేర్ చేశారాయన. ఆ వీడియోలో బర్రెను వ్యాన్ లోకి ఎక్కించే వ్యక్తి ఆ బర్రెను కాలుతో తంతూ వ్యాన్ లోకి ఎక్కించడం చూడవచ్చు. అంటే బీజేపీ నేతలకు క్రమశిక్షణ లోపించిందని వారిని దారిలో పెట్టేందుకు కాస్త అధిష్టానం కాస్త కఠినంగా వ్యవహరిచాలనే అర్థం వచ్చేలా ఆ వీడియో ఉంది. దీంతో బీజేపీలో నిజంగానే నేతల మధ్య అంతరం ఉందనే విషయం స్పష్టమైంది. అయితే మళ్ళీ తాను చేసిన వీడియో బీజేపీ నేతల గురించి కాదని, చెప్తూ జితేందర్ రెడ్డి మరో ట్వీట్ చేసినప్పటికీ.. మొదటి ట్వీట్ విపరీతంగా వైరల్ అయింది. మొత్తానికి బీజేపీ నేతలకు ట్రీట్మెంట్ అవసరం అని సొంత పార్టీ నేతలే ఒప్పుకున్నట్లైంది.
Also Read: బీజేపీలో మార్పు తప్పదా..?
This treatment is what's required for Bjp Telangana leadership.@blsanthosh @BJP4India @AmitShah @sunilbansalbjp @BJP4Telangana pic.twitter.com/MMeUx7fb4Q
— AP Jithender Reddy (@apjithender) June 29, 2023