- Advertisement -
మొబైల్ సిమ్ కార్డులకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించే ప్రక్రియకు ప్రభుత్వం తెరతీస్తోంది. ఇక నుంచి సిమ్ తీసుకొని యాక్టివేషన్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరంలేదు. ‘ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ సర్వీసు’ (ఈకేవైసీ) అందుబాటులోకి రావడంతో క్షణాల్లో సిమ్‌ను యాక్టివేట్ చేసి అందించనున్నారు.
ఎయిర్టెల్ డిల్లీలో ఈ సర్వీసును ప్రారంభించగా.. వొడాఫోన్ ఆగస్టు 24 నుంచి దేశవ్యాప్తంగా దీనిని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు ఆధార్ నంబర్, బయోమెట్రిక్ వివరాల ఆధారంగా వివరాలను సరిచూస్తారు. ప్రస్తుతం కస్టమర్ నుంచి ద్రువపత్రాలు ఇతరత్రా వివరాలన్నీ తీసుకున్న తర్వాత వాటిని తనిఖీ చేసి మొబైల్ సిమ్ కార్డు యాక్టివేషన్ చేసేందుకు కనీసం రెండు రోజుల వ్యవధి పడుతోంది. ఆధార్‌కు గనుక దీన్ని అనుసంధానం చేస్తే.. నిమిషాల వ్యవధిలోనే యాక్టివేషన్ పూర్తయ్యేందుకు వీలవుతుంది.
- Advertisement -