రోజులు మారుతున్న కొద్ది మన అలవాట్లలో కూడా చాలానే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఉదయం నిద్ర లేవగానే కల కృత్యాలు తీర్చుకొని ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఎంతో చురుకుగా, ఉల్లాసంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉదయం నిద్ర లేచినది మొదలు మళ్ళీ పడుకునే వరుకు బద్దకం, అలసట, నీరసం వంటి వాటితో రోజును గడిపేస్తున్నాము. ఇంకా చెప్పాలంటే మన పనులు మనం చేసుకోవడానికి కూడా అలసటగా భావిస్తుంటాము. అయితే ఇవన్నీ దూరం చేసుకోవాలంటే రోజంతా యాక్టివ్ గా పని చేయాలంటే కొన్ని అలవాట్లు మనం అలవరచుకోవాలి.
ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు రోజంతా ఫుల్ యాక్టివ్ గా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అయితే కొంతమంది వ్యాయామం చేయడానికి కూడా సమయం కేటాయించే వీలు ఉండదు. అలాంటి వారు ప్రతిరోజూ పరిగెత్తడానికి ( రన్నింగ్ ) సమయం కేటాయిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
రన్నింగ్ చేయడం వల్ల శరీరంలోని అన్నీ భాగాలకు కదలిక ఏర్పడుతుంది కాబట్టి అన్నీ అవయవాలకు రక్త ప్రసరణ సమృద్దిగా జరుగుతుంది. ఇంకా శ్వాసను కంట్రోల్ చేయడంలో కూడా రన్నింగ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. తీవ్రమైన ఒత్తిడిని దూరం ఏకాగ్రతను పెంచుతుంది. ఇంకా శరీరంలో పెరుకుపోయిన కొవ్వును త్వరగా కరిగించడంలో రన్నింగ్ ఎంతో ఉపయోగ పడుతుంది. అలాగే ఎముకలు, కండరాలు బలం దృఢంగా తయారు కావడానికి రన్నింగ్ చేయడం ఉత్తమం.
రెగ్యులర్ గా రన్నింగ్ చేయడం వల్ల పని మీద ఫోకస్ పెరిగి, సృజనాత్మకత పెరుగుతుందని పలు రకాల పరిశోధనలు చెబుతున్నాయి. ఇంకా ప్రతిరోజూ రన్నింగ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెజర్ సమతుల్యంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఎక్కువ సేపు రన్నింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది. ఇది రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. కాబట్టి రన్నింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందువల్ల ప్రతిరోజూ కనీసం 30 నిముషాల సమయమైన వాకింగ్‌కు కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read:విజయవాడ – శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’