మనం ప్రతిరోజూ వంటింట్లో వాడే సుగంధ ద్రవ్యాలలో గసగసాలు కూడా ఒకటి. మసాలా దినుసులుగా వీటిని కూరల్లో వినియోగిస్తూ ఉంటాము. గసగసాలు కూరలను సువాసన భరితంగా చేసి రుచిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మరి అలాంటి గసగసాలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. వాటిని తరచూ తినడం వల్ల ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనే విషయాలను తెలుసుకుందాం.. ! గసగసాలను తినడం వల్ల ఉపయోగాలు ఏ స్థాయిలో ఉన్నాయో నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.
గసగసాలలో ఎక్సెక్టోరెంట్, సీమల్సెంట్ వంటి వ్యాధి నిరోదక కారకాలు ఉంటాయి. ఇవి శరీరానికి తగిలిన గాయాలను నయం చేయడంలో సహాయ పడతాయి. అంతే కాకుండా శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, దగ్గు వంటి వాటిని నివారిస్తాయి. గసగసాలలో ఆక్సలెట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కాల్షియం శాతాన్ని పెంచి ఎముకలు దృఢంగా తయారు కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే దంత సమస్యలను దూరం చేస్తాయి కూడా. గసగసాలలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
Also Read:ముఖ స్వనాసనంతో ఒత్తిడి దూరం!
తద్వారా ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దూరమౌతాయి. గుండె సమస్యలు ఉన్నవాళ్ళు గసగసాలను కొద్దిగా వేయించి వాటితో కాస్త చక్కెర కలుపుకొని ఉదయం సాయంత్రం అర టీ స్పూన్ చొప్పున తింటే గుండె సంబంధిత సమస్యలు రావట. ఇక శరీరంలో వేడి శాతం ఎక్కువగా ఉన్నవాళ్ళు గసగసాలను పొడి చేసుకొని ఒక స్పూన్ తేనెలో కలుపుకొని సేవిస్తే బాడీకి చలువ చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే గసగసాలను ఎక్కువగా తీసుకుంటే పురుషులకు ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. గసగసాలలో ఉండే కొన్ని రసాయనాలు పురుషుల్లో వీర్య వృద్దిని తగ్గిస్తాయట. అంతే కాకుండా స్పార్మ్ ఇన్ యాక్టివ్ గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పురుషులు గసగసాలను అతిగా తింటే వారి లైంగిక సామర్థ్యం ప్రమాదంలో పడినట్లేనట.