‘జక్కన్న’ తొ కమర్షియల్ సక్సెస్ ని తన సొంతం చేసుకొన్న సునీల్ హీరోగా…. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఉంగరాల రాంబాబు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని శరవేగంగా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి…. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్నారు. సునీల్ సరసన అందాల భామ మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. మే మొదటి వారంలో జిబ్రాన్ సంగీతం అందించిన ఆడియోని విడుదల చేసి… మే చివరి వారంలో సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ” మా దర్శకులు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం షూటింగ్ పూర్తయింది. సునీల్ నుంచి ఆశించే వంద శాతం కామెడీ ఇందులో చూస్తారు. ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు క్రాంతి మాధవ్ హిలేరియస్ కామెడీ సన్నివేశాలతో కథను అద్భుతంగా చెప్పారు. నవ్వించమే ద్యేయంగా… అవుటాఫ్ కామెడి కాకుండా కథలోనే కామెడీని పొందు పరిచి నవ్విస్తాం. ప్రకాష్ రాజ్ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. హీరోయిన్ మియా జార్జ్ మరో ప్లస్ పాయింట్. పాటలు చాలా బాగా వచ్చాయి. ఆడియో సూపర్ హిట్ కావడం గ్యారంటీ. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రకాష్‌రాజ్, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రల్లో నటించారు. మే మొదటి వారంలో ఆడియో రిలీజ్ చేయనున్నాం. మే చివరి వారంలో సమ్మర్ కానుకగా చల్లని వినోదాల సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.” అని అన్నారు.
నటీ నటులు – సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున
సాంకేతిక వర్గం ;మ్యూజిక్ – జిబ్రాన్,లిరిక్స్ – రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్,సినిమాటోగ్రఫి – సర్వేష్ మురారి,ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర రావు,ఫైట్ మాస్టర్ – వెంకట్,డైలాగ్స్ – చంద్ర మోహన్ చింతాడ,ఆర్ట్ – ఎ.ఎస్.ప్రకాష్,కొరియో గ్రఫి – భాను మాస్టర్,పబ్లిసిటీ – ధని,పిఆర్ఓ – ఏలూరు శ్రీను, బ్యానర్ – యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిడెట్,ప్రొడ్యూసర్ – పరుచూరి కిరీటి,డైరెక్టర్ – కె. క్రాంతి మాధవ్