ఆరడుగుల కటౌట్,.. రాజసాన్ని తలపించే దేహ దారుఢ్యం.. గంభీరమైన స్వరం.. ఇక ప్రభాస్ గురించి ఎంత చేపిన తక్కువే అవుతుంది. హీరో అనే పదానికి పర్ఫెక్ట్ ఉదాహరణగా ప్రభాస్ నిలుస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు మరి అలాంటి ప్రభాస్ కటౌట్ ను ప్రస్తుత దర్శకులు సరిగా వాడుకోవడం లేదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బాహుబలి సిరీస్ లో ప్రభాస్ కటౌట్ కి ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు నీరాజనం పలికారు. ఆ మూవీలో ప్రభాస్ లుక్స్ విషయంలోనూ, బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ దర్శకుడు రాజమౌళి తీసుకున్న కేర్ అంతా ఇంతా కాదు. ఇక బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన ప్రతి సినిమాలో ప్రభాస్ లుక్స్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. .
సాహోలో ప్రభాస్ లుక్స్ కొంత పరవలేదనిపించినప్పటికి రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ కనిపించిన క్లీన్ సేవ్ లుక్ ఆయన అభిమానులను సైతం తీవ్ర నిరాశ పరిచింది. అంతే కాకుండా బరువు పెరగడం ఫేస్ లో మునుపటి గ్లామర్ లోపించడంతో ఆయన లుక్స్ పై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఇక ఇటీవల విడుదల అయిన ఆది పురుష్ మూవీలోని ప్రభాస్ లుక్స్ పై కూడా నెగిటివిటీ గట్టిగానే వినిపించింది. దీంతో మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో హండ్సమ్ గా కనిపించిన ప్రభాస్ ను ఇక చూడలేమా అనే డౌట్ ఆయన అభిమానుల్లో కూడా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ” సలార్ ” మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కనీసం ప్రశాంత్ నీల్ అయిన తమ హీరోను అందంగా చూపించాలని డార్లింగ్ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ కూడా గతంతో పోల్చితే కొంత బరువు తగ్గినట్లే కనిపిస్తోంది. దీంతో సలార్ మూవీలో వింటేజ్ ప్రభాస్ ను చూస్తామని అభిమానులు ఆశగా ఉన్నారు. మరి ప్రశాంత్ నీల్ అయిన ప్రభాస్ ను అందంగా చూపిస్తాడో లేదో చూడాలి.
Also Read:విటమిన్ డి తగ్గితే.. ఎన్ని ప్రమాదాలో!