సుఖనిద్ర కోసం..ఈ పొజిషన్ ట్రై చేయండి!

55
- Advertisement -

నేటి రోజుల్లో చాలమందికి నిద్ర అనేది అందని ద్రాక్షలా మారింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి కరణంగానో లేదా మానసిక ఒత్తిడి కారణంగానో కంటినిండా నిద్ర కరువై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు చాలమంది. అది కాకుండా స్మార్ట్ ఫోన్ వాడకం కూడా పెరిగిపోవడంతో అర్ధరాత్రి వరకు పోన్ చూస్తూ గడపడం వల్ల సుఖనిద్ర అనేది మరింత దూరమైపోతుంది. దాంతో సరిగా నిద్ర లేకపోవడం వల్ల.. రోజంతా బద్దకం, అలసట, వంటి సమస్యలతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. .

అందువల్ల రాత్రి పూట సుఖనిద్ర పోవడం చాలా అవసరం. అయితే సరిగా నిద్ర పట్టడానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర పోయే సమయంలో పడుకునే పొజిషన్ కూడా అంతే అవసరం. ఎలా పడితే అలా పడుకోవడం వల్ల నిద్ర త్వరగా రాదు. కాగా కొన్ని నిర్ధిష్ట పొజిషన్స్ వల్ల గాఢనిద్ర రావడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల నిద్ర చాలా త్వరగా వస్తుందట.

ఎందుకంటే ఎడమవైపు జీర్ణ వ్యవస్థ ఉంటుంది. అందువల్ల ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల పెద్ద ప్రేగు మరియు జీర్ణాశయంలోని వ్యర్థాలన్నీ కిందకు చేరుతాయి. తద్వారా జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తగ్గి సుఖనిద్ర కలుగుతుంది. ఇక వెల్లకిల పడుకునే అలవాటు ఉంటుంది. అయితే వెల్లకిల పడుకోవడం కన్నా ఒక సైడ్ తిరిగి కొద్దిగా బోర్లా పడుకుంటే గాఢ నిద్ర కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలమందికి తలగడ పెట్టుకునే అలవాటు ఉంటుంది. అయితే తలగడ పెట్టుకోవడం మంచిదే అయినప్పటికి.. మరి ఎత్తుగా పెట్టుకోవడం వల్ల నిద్రకు భంగం వాటిల్లడంతో పాటు.. మెదనొప్పికి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను గురించుకొని పడుకునే పొజిషన్ సరైన క్రమంలో ఉంటే.. సుఖ నిద్ర ఇట్టే పట్టేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:Harish:ప్రతిపక్ష నేతలే టార్గెట్ ఎందుకు?

- Advertisement -