కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాదించిన తరువాత టి కాంగ్రెస్ నేతలు తెగ హడావిడి చేస్తున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ దే విజయం అనే నినాదంతో కొత్త జోష్ లో కనిపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వర్గ పోరు, ఆధిపత్య విబేదాలతో కొట్టుమిట్టడిన హస్తం నేతలు ఇప్పుడు కలిసికట్టుగా పార్టీ కోసం పని చేసేందుకు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యం అధిష్టానం కూడా తెలంగాణ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తరచూ రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులపై టి కాంగ్రెస్ నేతలను అరా తీస్తోంది. ఇప్పటికే పలుమార్లు టి కాంగ్రెస్ నేతలతో బేటీ అయిన హస్తం హైకమాండ్ మరోసారి బేటీ కోసం నేతలకు పిలుపునిచ్చింది..
ఇప్పటికే కాంగ్రెస్ లోని ముఖ్య నేతలంతా డిల్లీ పయనం అయ్యారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమౌతున్న జూపల్లి కృష్ణరావు మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ బేటీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బేటీలో హైకమాండ్ నేతలకు ఎలాంటి సూచనలు చేయనుంది. తదుపరి వ్యూహరచన ఎలా చేయబోతుంది అనేది పోలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారిన చర్చ. అయితే ఈ బేటీ అనంతరం జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరే తేదిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read:వైసీపీకి షాక్.. జనసేన గూటికి ఆ మంత్రి ?
అలాగే ఈ మద్య వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరతారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయా కాంగ్రెస్ నేతలు కూడా ఈ అంశంపై స్పందించారు కూడా. అందువల్ల షర్మిల వ్యవహారంపై కూడా కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఇక ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమౌతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో హైకమాండ్ ఎలాంటి సూచనలు చేయనుందో చూడాలి. మొత్తానికి టి కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం బేటీ కావడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలకు తావిస్తోంది.
Also Read:బద్ధకం పోవాలంటే ఈ సూచనలు..