స‌న్నితో.. సీనియర్ హీరో స్టెప్పులు

202
- Advertisement -

అంకుశం, అగ్ర‌హం, మ‌గాడు వంటి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్‌గా వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన డా.రాజ‌శేఖ‌ర్ టాఫ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ చిత్రం“పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18M“. పూజా కుమార్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. రీసెంట్‌గా శృంగార తార స‌న్నిలియోన్‌పై చిత్రీక‌రించిన స్పెష‌ల్ సాంగ్ పూర్త‌వ‌డంతో ఈ చిత్రం ఏడు రోజులు మిన‌హా షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను స‌మ్మ‌ర్ సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

Rajasekhar'Garuda Vega' Ready For Summer Release

చంద‌మామ క‌థ‌లు, గుంటూరుటాకీస్ వంటి విల‌క్ష‌ణ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం ముంబై ఫిలిం సిటీ లో భారీ సెట్ వేసి స‌న్నిలియోన్‌పై స్పెష‌ల్ సాంగ్‌ను చిత్రీక‌రించారు. గందిబాత్‌…`, `రాం చాహే లీల చాహే…` వంటి బాలీవుడ్ సూప‌ర్‌హిట్స్‌కు కొరియోగ్ర‌ఫీ అందించిన విష్ణుదేవా నేతృత్వంలో 50 డ్యాన్స‌ర్స్‌తో మూడు రోజుల పాటు సాంగ్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రిపారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు, యాంగ్రీ యంగ్ మేన్ రాజ‌శేఖ‌ర్‌ను స‌రికొత్త లుక్‌లో ప్రెజంట్ చేస్తున్నారు. అల్రెడి విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్‌ను నుండి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. క్రేజీ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రం మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు స‌న్నిలియోన్ స్పెష‌ల్ సాంగ్ చేయ‌డం గ‌రుడ వేగ‌పై అంచ‌నాల‌ను ఇంకా పెంచుతుంది.

Rajasekhar'Garuda Vega' Ready For Summer Release

డా.రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, అరుణ్ అదిత్‌, కిషోర్‌, ర‌వివ‌ర్మ‌, చ‌ర‌ణ్ దీప్‌, నాజర్ , షాయాజీ షిండే, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్ః శ్రీకాంత్‌, సినిమాటోగ్ర‌ఫీః అంజి, మ్యూజిక్ః శ్రీచ‌ర‌ణ్‌, బ్యానర్: జ్యోస్టార్ ఎంట‌ర్ ప్రైజెస్, నిర్మాతః కోటేశ్వ‌ర‌రాజు, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌వీణ్ స‌త్తారు.

- Advertisement -